Madiki Singana
Madiki Singana - Quiz
Madiki Singana – Quiz : మడికి సింగన (1425-15౦౦) ప్రముఖ కవి. ఈయన జీవన కాలం 1400-1450 అని, 1425-1500 అనీ రెండు వాదనలున్నాయి. ఈయన తండ్రి నివసించిన తూర్పుగోదావరి జిల్లా మడికి గ్రామం పేరే వీరి ఇంటి పేరు అయింది. మడికి సింగన తండ్రి తొయ్యేటి అనపోత భూపాలుని దగ్గర మంత్రిగా ఉన్నాడు.
తొలి తెలుగు సంకలన గ్రంథాన్ని, తొలి భాగవత భాగాన్ని (దశమస్కంధం) వెలువరించిన కవిగా సింగనను పేర్కొనడం జరిగింది. ఈ రెండు కావ్యాలు సబ్బి మండలం (కరీంనగర్ జిల్లా) లోని రామగిరి ప్రభువు ముప్పు భూపతి మంత్రి వెలిగందల కందనామాత్యునికి అంకితం కావటంవల్ల 1420-1440 మధ్య కావ్యరచన చేశాడని నిర్థారించవచ్చని తెలుగు సాహిత్య చరిత్రలో ఆచార్య ఎస్వీ రామారావు ప్రస్తావించారు.
సింగన కవి తన 40 ఏట పద్మ పురాణం రచించాడు. సింగన ఈ కావ్యాన్ని కందనమంత్రికి అంకితం ఇచ్చాడు.
More About : Madiki Singana
మడికి సింగన క్విజ్