తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Palukuri Somanathudu

Palukuri Somanathudu Quiz

TeluguISM Quiz - Palukuri Somanathudu
0 381

Palukuri Somanathudu Quiz : శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన “శివకవి త్రయం” అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.

పాల్కురికి సోమనాధుడు(Palukuri Somanathudu) తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. వీరశైవ సంప్రదాయంలో సోమనాధుడు శివుని ప్రమధ గణాలలో “భృంగి” అవతారం.

అప్పటి ఇతర శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు(Palukuri Somanathudu) వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.సోమనాథుడు వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే వీరశైవ దంపతులకు జన్మించాడు. జన్మతహా వీరశైవుడైన సోమనాథుడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద వీరశైవ/శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.

 

More About : Palukuri Somanathudu

 

పాల్కురికి సోమనాథుడు క్విజ్

0%
1 votes, 5 avg
5

Quiz : పాల్కూరి సోమనాథుడు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Palukuri Somanathudu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. పాల్కూరి సోమనాథుడి తండ్రి పేరు ?

2. పాల్కూరి సోమనాథుడు ఏ యుగానికి చెందినవాడు?

3. తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వం ఏది ?

4. వృషాధిప శతకం రాసినవారు ?

5.  తెలంగాణ ఆదికవి అని ఎవరిని పేర్కోంటారు ?

6. 'చెన్నమల్లు సీసములు'లో చెన్నమల్లు అంటే ఎవరు?

7. పాల్కురికి సోమనాథుని ప్రథమ కృతి ఏది ?

8. మకుట సంఖ్యానియమాలతో తెలుగులో వచ్చిన మొదటి శతకం? 

9. క్రింద పెర్కొన్న వారిలో శివకవాత్రయంలో ఉన్నవారు ?

10. తొలి తెలుగు ఉదాహరణ కావ్యం ఏది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : మల్లికార్జున పండితారాధ్యుడు

Leave A Reply

Your Email Id will not be published!