పానుగంటి లక్ష్మీ నరసింహారావు
Panuganti Lakshminarasimha Rao - Quiz
Panuganti Lakshminarasimha Rao – Quiz : పానుగంటి లక్ష్మీ నరసింహారావు ( ఫిబ్రవరి 11,1865 – జనవరి 1, 1940) తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం ‘కవిశేఖరుడ‘నీ, ‘అభినవ కాళిదాసు‘ అనీ, ‘ఆంధ్ర అడిసన్‘ అనీ, ‘ఆంధ్ర షేక్ స్పియర్‘ అనీ బిరుదులతో అభినందించింది.
రచయితగా పేరుపడిన నరసింహరావు రక్తాక్షి సంవత్సరం మాఘ బహుళ పాడ్యమి నాడు అనగా 1865, నవంబర్ 2న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వేంకటరమణయ్య. తండ్రి రాజమండ్రిలో పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు.
వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. పరీక్షలలో ఉత్తీర్ణులైనారు. తరువాత పెద్దాపురం హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.
సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణరాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యము (ఇత్యాది నాటకములు). హాస్యవల్లరి, పతనము, మంజువాణి, జగన్నాథమూర్తి, మోసము, జలజ, సాక్షి (6 భాగములు).
శ్రీ లక్ష్మినరసింహము పంతులుగారి నాటకములలోని పద్యములు బండివానినుండి పండితునివఱకు బాడుకొని యానందించుచుందురు. నాటకరచనకంటె సాక్షివ్యాసములతో బానుగంటివారికి గొప్పపేరువచ్చింది. సాక్షి వ్యాసములకంటె నాటకరచనలో నరసింహరావు(Panuganti Lakshminarasimha Rao)పంతులుగారిని రసవిదు లెల్ల మెచ్చుకొనిరి.
More About Panuganti Lakshminarasimha Rao
పానుగంటి లక్ష్మీనరసింహరావు క్విజ్