తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Sangam Laxmi Bai

Sangam Laxmi Bai - Quiz

TeluguISM Quiz - Sangam Laxmi Bai
0 1,981

Sangam Laxmi Bai – Quiz : సంగం లక్ష్మీబాయి (Sangam Laxmi Bai) (జూలై 27, 1911 – జూన్ 3, 1979) స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత లోక్‌సభ సభ్యురాలు. ఆంధ్రప్రదేశ్ నుండి లోక్‌సభ సభ్యురాలైన తొలి మహిళ సంగం లక్ష్మీబాయే.

ఈమె 1911, జూలై 27 న ఘటకేసర్ సమీపంలోని ఒక కుగ్రామంలో జన్మించింది. ఈమె తండ్రి డి. రామయ్య. చిన్నతనంలోనే వివాహమైన తర్వాత బాల్యంలోనే తల్లిదండ్రులు, భర్త చనిపోవడంతో ఆమె అనాథ అయ్యింది. చాలా చురుకైన అమ్మాయి కావడంతో మద్రాసు ఆంధ్ర మహిళా సభలో చదువుకునే అవకాశం దొరికింది. ఈమె కార్వే విశ్వవిద్యాలయం, ఉన్నవ లక్ష్మీబాయమ్మ ప్రారంభించిన శారదా నికేతన్, మద్రాసు ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు. అక్కడ ఉన్నత చదువుల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. నారాయణగూడలో ఉన్న రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఎంతోమంది మహిళలను ఉద్యమాల్లో భాగస్వాములను చేసింది.

 

 

 

More About : Sangam Laxmi Bai

 

సంగం లక్ష్మీబాయి క్విజ్

0%
0 votes, 0 avg
8

Quiz : సంగం లక్ష్మీబాయి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Sangam Laxmi Bai- Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. సంగం లక్ష్మీబాయి 2 వ లోక్‌సభ కు ఏ సంవత్సరంలో ఎన్నికయ్యింది ?

2. సంగం లక్ష్మీబాయి ఎక్కడ చదువుకున్నారు ?

3. సంగం లక్ష్మీబాయి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కాల వ్యవధి ?

4. సంగం లక్ష్మీబాయి ఎన్ని సంవత్సరాలుగా ఆంధ్ర మహిళా సభ యొక్క సభ్యురాలిగా ఉంది ?

5. ఇందిరా సేవా సదన్ స్థాపించిన వారు ?

6. సంగం లక్ష్మీబాయి ఏ సంవత్సరంలో  ఇందిరాసేవాసదన్ ను స్థాపించింది ?

7. సంగం లక్ష్మీబాయి దేనికి ప్రసిద్ధి చెందినవారు ?

8. సంగం లక్ష్మీబాయి ఏ నియోజకవర్గం నుండి లోకసభకు ఎన్నికై భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా ఉన్నారు ?

9. ఏ సంవత్సరంలో సంగం లక్ష్మీబాయి 4వ లోకసభకు ఎన్నికై భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా ఉన్నారు ?

10. సంగం లక్ష్మీబాయి ఏ నియోజకవర్గం నుండి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య క్విజ్ 

Leave A Reply

Your Email Id will not be published!