తిక్కన సోమయాజి
Tikkana Somayaji
Tikkana Somayaji Quiz : తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 – 1288). విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. అతనికి “కవి బ్రహ్మ“, “ఉభయ కవిమిత్రుడు” అనే బిరుదులు ఉన్నాయి.
తిక్కన శిష్యుడు మారన. ఇతడు రాసిన మార్కండేయ పురాణం ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో ఒకడైన నాగయగన్న మంత్రికంకితం చేసెను. గణపతిదేవుని ఆస్థానంలోకి చేరేటప్పటికి తిక్కన సోమయాజి యజ్ఞము చేయలేదు. భారతమును కూడా రచించలేదు.
అతని తల్లిదండ్రులు కొమ్మన, అన్నమ్మలు. కేతన, మల్లన, పెద్దన ఇతని పెదతండ్రులు. తిక్కన సోమయాజి పెదతండ్రి కుమారుడు అయిన సహోదరుడు ఖడ్గతిక్కన. తిక్కన కుమారుడు కొమ్మన. తిక్కన మనుమరాలి భర్త యల్లాడమంత్రి. ఈ యల్లాడమంత్రి మనుమడు కవి సింగన్న. ఈ సింగన్న తండ్రి అయ్యలమంత్రి. తిక్కనసోమయాజి తాత మంత్రి భాస్కరుడు. తిక్కన కవి గౌతమిగోత్రుడు.
ఈ తిక్కన నియోగిబ్రాహ్మణుడు. ఈయన పూర్వుల నివాసస్థలము మొట్టమొదట కృష్ణామండలంలోని వెల్లటూరు గ్రామం. ఉద్యోగరీత్య ఇతని తాత కాలమున గుంటూరునకు వచ్చారు. తరువాత నెల్లూరు రాజగు మనుమసిద్ది ఇతని కుటుంబమును ఆదరించి నెల్లూరుకి తీసుకొనివచ్చి పూర్వము హరిహర దేవాలయము ఉండిన ఇప్పటి రంగనాయకస్వామి ఆలయ సమీపమున గృహము కట్టించి ఇచ్చి తిక్కనసోమయాజులను అందుంచాడు. కేతన రాసిన దశకుమార చరిత్రనుబట్టి చూడగా తిక్కన ఇంటి పేరు కొత్తరువుయరయినట్టు తెలియవచ్చునది. తిక్కనకి అంకితము చేయబడిన దశకుమారచరిత్రము అను గ్రంథమునందు తిక్కన వంశావళి సమగ్రముగా వర్ణించబడింది.
More About : Tikkana Somayaji
తిక్కన సోమయాజి క్విజ్