వట్టికోట ఆళ్వారుస్వామి
Vattikota Alwar Swamy - Quiz
Vattikota Alwar Swamy – Quiz : వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, ప్రచారకుడు.
భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట(Vattikota Alwar Swamy) అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.
1915 నవంబర్ 1 తేదీన నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చెరువు మాదారంలో సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు జన్మించాడు. తండ్రి చిన్ననాట చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండిపెడుతూ విద్యాభ్యాసం, సారస్వతాభ్యాసం చేశాడు.
గ్రంథాలయోద్యమంతో మొదలైన ప్రేరణ ఆళ్వారుస్వామిని(Vattikota Alwar Swamy) నిజాం వ్యతిరేకోద్యమం దాకా నడిపించింది. ప్రజల్లో కలిసి ఆయన పనిచేసిన తీరు నిజాంకు కోపం తెప్పించింది. దానితో ఆయన జైలు పాలు అయ్యాడు.
వంటపనిలో, ప్రూఫ్ రీడింగ్‌లో, హోటల్ సర్వర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆయన ప్రజల మనిషిగా నిలబడేట్టు చేశాయి. నిజాంను గడగడలాడించిన ‘ఆంధ్రమహాసభ’ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ప్రజాచైతన్యాన్ని కూడగట్టాడు.
More About : Vattikota Alwar Swamy
వట్టికోట ఆళ్వారుస్వామి క్విజ్