తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Yerneni Subramanyam

Yerneni Subramanyam - Quiz

TeluguISM Quiz - Yerneni Subramanyam
0 444

Yerneni Subramanyam – Quiz : యెర్నేని సుబ్రహ్మణ్యం (1898 – 1974) సాధు సుబ్రహ్మణ్యం గా ప్రసిద్ధి చెందిన భారత స్వతంత్ర సమరయోధుడు. గాంధేయవాధి.మహాత్మా గాంధీ గారితో కలసి దండి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక తెలుగు వ్యక్తి . కొమరవోలులో గాంధీ ఆశ్రమాన్ని స్థాపించారు. వినోభాభావే భూదాన ఉద్యమంలో పాల్గోన్న వ్యక్తి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు గారికి చివరివరకు తోడుండి పోరాడిన వ్యక్టి. యెర్నేని సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా లోని కొమరవోలు గ్రామంలో 1898 లో జన్మించారు. ఈ గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

సుబ్రహ్మణ్యం 25 సంవత్సారాల వయస్సులో మహాత్మా గాంధీ గారితో కలసి దండి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో 1930 మార్చి 12 న ప్రారంభించిన ఈ దండి యాత్రలో గాంధీ గారితో కలిసి నడిచిన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లలో ఏకైక తెలుగు వ్యక్తిగా వీరు గుర్తింపు పొందాడు.ఈ యాత్ర 24 రోజుల తరువాత 1930 ఏప్రిల్ 6 న దండి వద్ద ముగిసింది, అక్కడి నుండి తిరిగి వచ్చి మరల ఆంధ్రాలో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గోన్నారు. యలమంచిలి వెంకటప్పయ్య గారితో కలిసి కన్ననూరులో ఒక ఎడాది పాటు కారాగారంలో ఉన్నారు.

 

More About : Yerneni Subramanyam

 

యెర్నేని సుబ్రహ్మణ్యం క్విజ్

0%
0 votes, 0 avg
2

Quiz : యెర్నేని సుబ్రహ్మణ్యం 

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Yerneni Subramanyam - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గోన్నందులకు సుబ్రహ్మణ్యాన్ని 2 సంవత్సరాలు పాటు ఏ  జైల్లో ఉంచారు ?

2. పొట్టి శ్రీరాములు, సుబ్రహ్మణ్యంతో కలసి ఎక్కడ ఆంధ్రరాష్ట్రం కోసం దీక్ష ప్రారంభించారు ?

3. యెర్నేని సుబ్రహ్మణ్యం ఏ సంవత్సరంలో గాంధీ ఆశ్రమాన్ని స్థాపించారు ?

4. యెర్నేని సుబ్రహ్మణ్యం నడిపిన దరిద్ర నారాయణ పత్రికకు గాంధీ సిద్ధాంతంపై రచనలు చేసినవారు ?

 

5. యెర్నేని సుబ్రహ్మణ్యం ఏ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు ?

6. దండి సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైకా తెలుగువాడు ?

7. యెర్నేని సుబ్రహ్మణ్యం ఎప్పుడు మరణించారు ?

8. యెర్నేని సుబ్రహ్మణ్యం ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారితో కలసి దండి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. ?

9. యెర్నేని సుబ్రహ్మణ్యం గాంధీ ఆశ్రమాన్ని ఎక్కడ స్థాపించారు ?

10. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు గారికి చివరివరకు తోడుండి పోరాడిన వ్యక్తి ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : యలమంచిలి వెంకటప్పయ్య క్విజ్ 

Leave A Reply

Your Email Id will not be published!